Saturday, October 5, 2024
HomeదైవంSrisailam: అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

Srisailam: అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

శ్రీశైల మహా క్షేత్రంలో చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ముందుగాఏ రోజు వస్తే ఆ రోజు శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.

- Advertisement -

అమ్మవారికి సాత్విక బలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పిస్తూ ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు చేశారు. తరువాత అమ్మవారికి ఈకొబ్బరికాయలు సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News