Tuesday, September 17, 2024
HomeతెలంగాణTanduru: ఈ భవనం పేరేమిటి?

Tanduru: ఈ భవనం పేరేమిటి?

ఈ భవనం పేరేంటి? వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులు ఉండగా, అందులోంచి భాగాలుగా వేరు చేసి ఆయా వార్డులకు దగ్గరలో డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు చేసుకోవడానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 27వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు మొదలైన విషయం తెలిసిందే.  నూతన మున్సిపల్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఆయా వార్డు ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మున్సిపల్ కార్యక్రమం దగ్గరికి వెళ్లి ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతున్నారు.

- Advertisement -

అంటే ఎదురుగా ఉన్న కూడా బోర్డ్ లేనందుకు గుర్తించలేకపోతున్నారన్నమాట.  సుమారు 347.09 లక్షల రూపాయలతో తేదీ 30-10-2021 లో నిర్మించిన మున్సిపల్ కార్యాలయానికి చిన్న బోర్డ్ కరువైంది అని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 1 కాగా వచ్చే ప్రజలకు మున్సిపల్ కార్యాలయం బోర్డు లేక అయోమయంలో దాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు.   ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి బోర్డు ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News