శ్రీరామ నవమి పురస్కరించుకొని పోచంపాడ్ కోదండ రామాలయంలో రాములవారి కల్యాణోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి-నీరజా రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మెండోరా మండలం పోచంపాడ్ – సొన్ పెట్ గ్రామాల మద్య కాకతీయ కెనాల్ పై 1.30 కోట్లతో నిర్మించే నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.