ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఈరోజు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులు తుది అంకానికి చేరుకున్నాయి. సెంట్రల్ విస్టాలోని కొన్ని పనులు పునఃఅభివృద్ధిలో ఉన్నాయి. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. పెద్ద హాల్స్, లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్లేస్, కమిటీ రూములు..ఇలా దేనికవి గొప్పగా, అనుకూలంగా ఉండేలా ఆధునిక వసతులు, సాంకేతికతతో నిర్మిస్తున్నారు. గంటకు పైగా ఈ పనులన్నీ మోడీ పరిశీలించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మోడీ వెంట ఉన్నారు. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచే ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కావాల్సి ఉన్నా అది జరగలేదు.
Parliament new building: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన మోడీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES