Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్English is better: ఇంగ్లీషు భాషే బెటర్‌!

English is better: ఇంగ్లీషు భాషే బెటర్‌!

మాతృభాషలలో వృత్తి సంబంధమైన కోర్సులను బోధించడంలో బీజేపీయేతర రాజకీయ పార్టీలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. అవి ఉద్దే శపూర్వకంగా మాతృభాషలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పేద, వెనుకబడి న తరగతులకు చెందిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కాకూడదనే ఉద్దేశంతోనే అవి మాతృభాషల అ భివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆయన అన్నారు. ఆయన త్వరలో ఎన్నికలు జరగబోతు న్న కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో ఒక ఎన్నికల సభలో ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రయోజనా లను ఆశించే కావచ్చు. కానీ, మాతృభాషల్లో వృత్తిపరమైన కోర్సులను బోధించడం అనేది ఆషామాషీ వి షయమేమీ కాదు. పైగా, ప్రస్తుత కాలంలో అటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం ఏమ ౦త అనుకూలంగా కూడా లేదు.
మాతృభాషా మాధ్యమంలో వృత్తిపరమైన కోర్సులను బోధించడం వల్ల విద్యార్థులలోని నైపుణ్యాలు మరింత పదునెక్కుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్య వర కూ మాతృభాషలో బోధన గరపవచ్చు కానీ, ఆధునిక ఇంజనీరింగ్‌, డాక్టర్‌ కోర్సులను మాతృభాషా మా ధ్యమంలో బోధించడం వల్ల విద్యారంగం గందరగోళంగా, బీభత్సంగా మారిపోవడం ఖాయం. అటువం టి కోర్సులను బోధించే స్థాయికి మాతృభాషలు ఇంకా అభివృద్ధి చెందలేదన్నది వాస్తవం. ఇది అసాధ్యం కాకపోవచ్చు కానీ, ఇది సవాళ్లతో, సమస్యలతో కూడుకున్న వ్యవహారమని తప్పనిసరిగా అర్థం చేసుకోవా ల్సి ఉంటుంది. అంతేకాదు, సదవకాశాలకన్నా దురవకాశాలే ఎక్కువన్నది కూడా గమనించాలి. వృత్తిపర మైన కోర్సులను మాతృభాషలో బోధించడానికి ఇప్పటికిప్పుడు చర్యలు, ప్రయత్నాలు ప్రారంభించినా ల క్ష్యాన్ని అందుకోవడానికి తప్పకుండా కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. చివరికి ఆ లక్ష్యం కూడా గంద రగోళంగా ఉండదని ఖాయంగా చెప్పలేం.
భారతీయ భాషల్లో వృత్తిపరమైన కోర్సులను బోధించడానికి నాణ్యమైన అధ్యాపకులను, బోధనాచా ర్యులను తయారు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక అంశాలలో సొంత పరిభాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఒకే అంశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ భాషల డాక్టర్లు, ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారితో సంపర్కం చేయడానికి, సంభాషించడానికి ప్రయత్నించడమంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు. మన పూర్వీకులు రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే వృత్తిపరమైన కోర్సుల ను బోధించడానికి వీలుగా మాతృభాషలను అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది. ఉదాహరణకు, రష్యా, చై నాలతో సహా కొన్ని దేశాలలో సొంత భాషల్లోనే వృత్తిపరమైన కోర్సులను బోధించడం జరుగుతోంది. అ యితే, ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. భారతీయులు కూడా శతాబ్దాల క్రితమే నిలకడగా ఈ రకమైన ప్రయత్నం చేసి ఉంటే, ప్రాంతీయ భాషల్లో వృత్తిపరమైన కోర్సులు ఇతర దేశాలకంటే ఎక్కువ గా అభివృద్ధి చెంది ఉండేవి.
దురదృష్టవశాత్తూ అటువంటి ప్రయత్నమేమీ జరగలేదు. బ్రిటిష్‌ రాజకీయవేత్త, చరిత్రకారుడు అయి న థామస్‌ మెకాలే 1835లోనే ఇంగ్లీషులో వృత్తిపరమైన కోర్సులను భారతీయులకు బోధించడానికి మార్గ ౦ సుగమం చేశాడు. అప్పట్లో ఇంగ్లీషు విద్యాబోధనలో మునిగి తేలుతున్న భారతీయ పేద, మధ్యతరగ తి యువతకు భారతదేశంలో మేధోపరమైన ప్రతిష్ఠంభనకు ఇంగ్లీషు బోధనే ఒక అత్యుత్తమ పరిష్కార మార్గంగా కనిపించింది. ఇతర ఐరోపా దేశాలన్నికంటే భారతదేశానికే ఇది ఎక్కువగా మేలు చేస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వేళ్లు నాటుకుపోయింది. విచిత్రమేమిటంటే, ఇంగ్లీషులో విద్యాబోధన జరు గుతున్నందువల్లే భారతదేశం ఒక్కటిగా నిలిచి ఉండడానికి అవకాశం కలిగిందనే భావన కూడా బలపడి పోయింది. అందువల్ల, వృత్తిపరమైన కోర్సులను ఇంగ్లీషులోనే బోధించడం సమంజసంగానూ, శ్రేయస్క రంగానూ కనిపిస్తోంది. కళలు, సంస్కృతి, రంగస్థలం, సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్‌ వంటి కోర్సు లను అవసరమైతే మాతృభాషల్లోనూ, ప్రాంతీయ భాషల్లోనూ బోధించవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు విద్యాబోధనను గందరగోళపరచడం భావ్యం కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News