Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభAli Daughter Marriage : ఘనంగా అలీ కూతురి వివాహం.. తరలివచ్చిన టాలీవుడ్ ప్రముఖులు

Ali Daughter Marriage : ఘనంగా అలీ కూతురి వివాహం.. తరలివచ్చిన టాలీవుడ్ ప్రముఖులు

ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల దంపతులు, ఏపీ ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రి రోజా, మంచు లక్ష్మి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాగార్జున-అమల దంపతులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఫాతిమా వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

పెళ్లిపనులు మొదలైనప్పటి నుండి.. వాటికి సంబంధించిన వీడియోలను అలీ భార్య ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుండేది. ఇక ఫాతిమా అత్తింట్లో తన భర్త సహా అందరూ డాక్టర్లేనన్న విషయాన్ని అలీ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. అలీ కూతురు కూడా ఇటీవలే డాక్టర్ పట్టా అందుకుంది. ఇక ఇటీవలే అలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. 1979లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన అలీ.. ఇప్పటివరకూ 1000కి పైగా సినిమాల్లో నటించి, పేరు ప్రఖ్యాతులు గడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News