ఇటలీలో ఘోరప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్ లో ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడటంతో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 26న తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాద ఘటనలో కొందరు బురదలో కూరుకుపోయారు. మృతుల్లో మూడువారాల వయసున్న చిన్నారి కూడా ఉండటం బాధాకరం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొద్దిరోజులుగా ఇస్కియా ఐలాండ్ లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి సముద్రతీరంలో ఉన్న భారీ కొండ పై నుండి సగభాగం కూలిపోయింది. ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియల వేగానికి.. కింద ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. అక్కడి ఇళ్లలో ఉన్నవారిలో ఏడుగురు మరణించారు. పార్కింగ్ లో ఉన్న వాహనాలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. గడిచిన 6 గంటల్లో అక్క 126మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. 20 ఏళ్ల ఇదే భారీ వర్షపాతమని అధికారులు పేర్కొన్నారు.