Sunday, June 22, 2025
Homeనేషనల్Sidhu: జైలు నుంచి విడుదలైన సిద్ధూ

Sidhu: జైలు నుంచి విడుదలైన సిద్ధూ

మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. 59 ఏళ్ల సిద్ధూ 10 నెలల జైలు శిక్ష అనుభవించారు.  పటియాలా జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. 34 ఏళ్ల క్రితం హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషిగా తేలి జైలు జీవితం అనుభవించారు. నిజానికి ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన శిక్షా కాలం మేలో ముగుస్తుంది కానీ సత్ప్రవర్తన కింది ఆయన 48 రోజుల ముందే జైలు నుంచి విడుదల అయ్యారు. 10 నెలల జైలు జీవితం తరువాత సిద్ధూ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు.  సిద్ధూ కుమారుడు కరణ్ సిద్ధూ మాత్రం తన తండ్రి పూర్తిగా మారిపోయారని హర్షం వ్యక్తంచేస్తున్నారు.  అయితే సిద్ధూ సతీమణికి క్యాన్సర్ సోకడంతో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News