నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్త నదీ సంగమేశ్వరం పుణ్య క్షేత్ర సందర్శనం కోసం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివనాయుడు సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నారు, సంగ మేశ్వరునుకి జల, పాలాభిషేకం లతో పాటు పంచామృత, రుద్రా భిషేకములు,వి భూది అభిషేకం, అష్టోత్తర శతనామావళి, సహస్ర నామావళి, రుద్ర సూక్తము తదితర పూజలను సంగమే శ్వరునికి ఘనంగా నిర్వహించారు. తదనంతరం సంగమేశ్వర ప్రాంగణంలో ఆరు బయట సప్త నదీ జలములు అయిన శ్రీశైలం బ్యాక్ వాటర్స్ 806 అడుగులకు తగ్గి పోవడంతో భీమ లింగేశ్వర స్వామి జల సమాధి నుండి బాహ్య ప్రపంచంలోకి దర్శన భాగ్యం కలిగించడంతో భీమ లింగేశ్వర స్వామికి కూడా ఘనమైన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
Kothapalli: సంగమేశ్వరానికి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES