ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం తొలగి శాంతి నెలకొనాలని కోరుతూ ఐఐఎఫ్ఎల్, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో అహింసా రన్ నిర్వహించారు. 3000 మందితో నిర్వహించిన రన్ కు నెక్లెస్ రోడ్ వేదికైంది. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏడీజీపీ సంజయ్ జైన్ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.
ట్రేడ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సుశీల్ సంచేటి మాట్లాడుతూ శాంతి, అహింసా నినాదంతో ప్రపంచవ్యాప్తంగా 85 పట్టణాల్లో నిర్వహించిన రన్ లో లక్ష మంది ఔత్సాహికులు పాల్గొన్నట్లు వెల్లడించారు. తీవ్రవాదం, ఘర్షణలు, విధ్వంసంతో ప్రపంచ ప్రజలు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన దారిలో ప్రపంచవ్యాప్తంగా శాంతి, సహనం నెలకొనాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆఫీస్ బేరర్లు, మహిళా విభాగం ఆఫీస్ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.