Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Youth: ఓ యువతా! మేలుకో

Youth: ఓ యువతా! మేలుకో

నేటి యువత రేపటి భావితరాలకు వెన్నెముక లాంటి వారు. ఆనాటి మహనీయులు అయిన సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద,  భగత్ సింగ్, సీవీ.రామన్, డా॥ అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంకా ఎందరో మహనీయులు దేశం కోసం స్వార్థాన్ని వదులుకొని జీవితాన్ని సమర్పించారు. వారు మన అందరికి అందించిన అద్భుత ఫలితాలే నేడు మనము ఆనందంగా గర్వంగా, తలెత్తుకొని జీవిస్తూ ఉన్నాము. మనలోనున్న జవసత్వాలకు పదును పెడదాం. మనలో ధైర్యం, సాహసం, మనోనిగ్రహం, శ్రద్ధ, పట్టుదలతో ముందుకు వెళ్తాం. ఎవరైన పిరికితనంతో, జంకుతో, భయంతో, జీవితం చీకటి మయం జీవించడం దుర్భరం. మేము సాధించలేము.. ఇక నా వల్ల.. సాధ్యమయ్యే పనేనా..? డబ్బులు వున్నవారు ఎంతో అందలం ఎక్కుతారు. మా వల్ల సాధ్యంకాదు అని నిరాశనిస్పృహలకు లోను అయ్యేవారు వుంటారు. వారిని చైతన్యమైన శక్తి కల్గినవారు దగ్గరకు దరిచేర్చి.. ఓదార్చి.. వారిలో నున్న పిరికితనాన్ని తొలగించి.. అజ్ఞాన చీకటిలో నున్నవారికి ఎంతో మనోధైర్యాన్ని, సంకల్పశక్తిని, శ్రద్ధను, పోరాట విశ్వాసంతో చేయగలిగితే సర్వం మనవే అవుతాయి.

- Advertisement -

1. మానవుడిని పట్టిపీడిస్తున్న ప్రధాన జబ్బులు

ఎ) శారీరక రోగాలు

బి) మానసిక రోగాలు

ఎ) శారీరక రోగములు:

శరీరాన్ని బాదించి కృశింపచేయు రుగ్మతలే శారీరక రోగాలు. ఈ రోగాలు వంశపారంపర్యంగా సంక్రమించేవే. జన్యులోపాల వల్ల వచ్చేవే. అగంతక వ్యాధులు, వైద్యశాస్త్రానికి అంతుచిక్కని జబ్బులు.

మనిషికి కోరికలు ఎప్పుడైతే నెరవేరవో.. అప్పుడే క్రోదంగా మారి విషపూరితం కాగలవు. అపుడే మనిషిలో అహంకారం ప్రవేశించి తీవ్రమైన వ్యధను చెంది వికృతమైన స్థితిలోకి వెళ్లడం అపుడే ఆ మనిషి తీరని మనోవ్యాకులత చెంది ఆత్మస్వైర్యాన్ని కోల్పోతాడు. నేను ఏది సాధించలేను ఎందుకు ఈ బ్రతుకు, తలంచి ఆత్మహత్యలకు దారితీయడం జరుగుతుంది.

నీవు ఏమైనా చేయగలవు..

– స్వామి వివేకానంద

అసమర్థుడని భావించకు. అన్నింటిని సాధించగలవు

ప్రతి ఒక్కరు చిరాకు, విసుగు, దిగులు, ఆశాభంగం, విమర్శ, అసూయ, ద్వేషం, నిరాశ, అపరాధభావం, భయం ఇవి అన్ని ఉన్నవారు దుఃఖంతో ఐశ్వర్యహీనులై అనారోగ్యంపాలై రోజురోజుకి దిగజారేలా పతనమై నామరూపాలు లేకుండా పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యం తో తులతూగుతూ దినదినాభివృద్ధి చెంది గుణాలను పెంపొందించుకోవాలి. సత్యం, ధర్మం శాంతం, ప్రేమ, ఉత్సాహం, కుతూహలం, సంతృప్తి, మంచి ఆశయం, కృతజ్ఞత, దయ, దానం ఔదార్యం, వినయం, విధేయ వైరాగ్యం కల్గిన వారు ఈ ప్రపంచంలో నిజమైన ఆనంద,కోటీశ్వరులేనని చెప్పవచ్చు.

మనము క్షేమంగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తాము. అంతబాగా మనము మన కుటుంబము, సమాజము, దేశము, సంఘము ఆరోగ్యకరంగా శక్తివంతంగా ఉండాలన్నదే ధృఢమైన మంచి సంకల్పము. అందరు బాగుంటే అదే ఆరోగ్య సమాజంగా వుంటుంది. మనము చూసే దృష్టంత చల్లగా, శాంతంగా సుఖంగా ఉండాలి. మనమంతా సమానమే. ప్రతి ఒక్కరిలో ఉండే దేవుడు ఒక్కడే. కావున మనం ఒక్కొక్కరికి ఒక్కరం సంస్కారమైన అలవాట్లను నేర్చుకుందాం. ఎదుటివారికి నమస్కారం చెబితే అవతలి వారి నుంచి “సంస్కారం” వస్తుంది. ఇది తరతమ భేదములు లేకుండా సమానంగా చూడాలి.

బి) మానసిక రోగాలు: మనస్సుకు క్షోభవల్ల వచ్చే రుగ్మతలే మానసిక రోగాలు. మానసిక రోగాలకు ప్రధాన కారణం 1. కామ 2. క్రోధ 3. లోభ 4. మోహ 5. మద 6. మత్సర్యములే.

మనము మాట్లాడే మాటలో మృదత్వం, సంతోషం, ఆనందం, నిత్యం, ధర్మం, ప్రేమ, వినయం కల్గివుండాలి. చాలా మంచి వాక్కు వలన సౌఖ్యం కలుగుతుంది. అదే వాక్కు గర్వంతో మాట్లాడితే పగలు వచ్చును. అందుకే వాక్కు వలన సుఖమయ, సౌఖ్యములు కలగాలి. వాక్కు వలన ప్రతిష్ఠలు, అప్రతిష్ఠలు కలుగుతాయి. వాక్కువలన మంచి, చెడులు జరుగుతాయి. వాక్కువలన గౌరవం లభిస్తుంది.

ప్రతి ఒక్కరం చెడు మాట్లాడకూడదు:

మనము చేసే పనుల్లో ఫలితం ఆశించకూడదు. భగవంతుని కార్యములలో ఫలితంపై అందరికి శుభకరముగా ఉండు పనులు చేయాలి. తదుపరి కష్టమునకు ఫలితం తప్పక వస్తుంది. ఈ ఫలంపై ఎటువంటి దోషము వుండదు. ప్రతి కార్యము వెనుక కారణము వుంటుంది అన్న అంశం గుర్తించుకోవాలి. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టు ఎందరో నైపుణ్యత కలిగిన ఇంజనీర్లు, మేదావుల కార్యరూపమే ఈ రోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. లక్షల మందికి జీవనోపాధి కలుగుతోంది. పర్యావరణం మెరుగుపడుతోంది. ఇది అంతా వారి సంకల్పమే గదా! ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మనము జీవిస్తూ పోయినా తరువాత కూడ జీవించాలన్నదే ప్రతి ఒక్కరి మతము. 

ప్రతి రోజు ఉదయం వేళల్లో 1 గంట వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలి.

మంచి స్పూర్తిని ఇవ్వగలిగిన మహనీయులు గ్రంథాలను చదవడం చేయాలి.

మంచి హితము కోరే ఆత్మీయ మిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలి.

సరియైన సమయంలో సాత్వికమైన ఆహార, పానీయాలను తీసుకోవాలి. చిన్న చిన్న శారీరక రుగ్మతలకు సొంత వైద్యం వాడరాదు. నిపుణులైన వైద్యులను సంప్రదించి స్వస్థత పొందాలి. “సెల్ ఈజ్ ఏ హెల్” సెల్లులను అతిగావాడి అనర్థాలకు గురికాకుండా చూసుకోవాలి. మహనీయులు నోస్ట్రాడమాన్, వీరబ్రహ్మేంద్రస్వాముల వారు గతంలో చెప్పిన విధంగా వింత వింత వ్యాధులు పుడతాయయా..? మాతలలు పగిలి చస్తారయా..? అన్నారు. మనం చూస్తూనే వున్నాము. సెల్లులు ఎంత ప్రయోజనకారియో, ఎంత అప్రయోజనమే కళ్ళారా చూస్తున్న నిజం. వీటికి వీలైనంత దూరంగా వుండాలని మనవి. భారతదేశంలో సెల్ఫోన్ వాడకం వలన 80 శాతం యువత నైపుణ్యత కోల్పోయి అనారోగ్య పాలవుతున్నారు. 20 శాతం మాత్రమే యువత నైపుణ్యత సాధిస్తున్నారు. ఉన్నత విశ్వవిద్యాలయంలో నాణ్యమైన చదువులు అందించినట్లయితే అన్ని రంగాల్లో నైపుణ్యత సాధిస్తారు. ఉన్నత విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య లేనందున యువత ఉద్యోగాలు రాక..  చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు.

ఈ మధ్యకాలంలో “బ్లూవేల్ గేమ్, అనేది యువతను ఆకర్షించి ఆత్మహత్యలకు దారితీస్తున్న విషయం విదితమే. అంటే మన మనస్సు ఎంత బలహీనమైనదో మనకు అర్థం అవుతుంది. మన మనస్సుకు సొంతంగా ఆలోచించే స్థాయిని కోల్పోయి పరాయి మనిషి ఆధీనంలోకి వెలుతోంది. ఇది భయంకరమైన బలహీనత కావున వీటి జోలికి వెళ్ళకూడదని మనవి చేస్తున్నాం.

గంజాయి, పొగాకు, హెరయిన్, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలు, గుట్కా వలన శరీర ఆరోగ్యం దెబ్బతింటోంది. అంతేకాక వాడికి డబ్బులు వెచ్చించడం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

భారతదేశంలో యువశక్తికి అవకాశములు లేక నిర్వీర్యం అవుతోంది. నేడు దేశంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన యువతలో 31% మంది ఏ పనిలేక జీవిస్తున్నారు. వీరంతా 650 విశ్వవిద్యాలయాలు, 160 వేల కళాశాలల నుండి ఉద్భవించిన వారే. వీరు చదివిన చదువు ఎందుకో స్వతంత్రంగా జీవించే జీవన విధానం వీరి దగ్గర లేదు. వీరి జీవితానికి దిశా నిర్దేశం లేదు. మన దేశంలో ప్రతియేటా కోటినుంది నిరుద్యోగులు తయారు అవుతున్నారు. అయితే ప్రభుత్వాలకు 8 లక్షల మంది కంటే ఎక్కువ అవసరం లేదు. దీంతో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంలో ముందుకు వెళ్ళలేక పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై సంఘ విద్రోహక శక్తులుగా మారుతున్నారు. ఈ సమస్యల్ని ఎదుర్కొనే సామాజిక దృష్టి కలిగిన యువకులని తయారు చేసుకొని ఉపాధిని, సామాజిక సేవను సమన్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది. కర్మసిద్ధాంతం, కులమత భావాలు వీరిని వెంటాడుతున్నాయి. కరుణా, ప్రేమ, ఆత్మీయత, సంయమనం, శ్రమచేసే గుణాలను యువత, విద్యావంతులు అలవర్చుకునే అవసరం ఎంతైనా ఉంది. యువకులకు శక్తి సామర్థ్యాలను బట్టి వారికి పనులను, విద్యను అప్పగించాల్సిన అవసరం చాలా ఉంది. వనరులున్న మనదేశం సామాజిక, ఆర్థిక పునర్జీవనం చెందాలంటే యువజన భారత పునర్జీవన ఉద్యమం అవసరం. నా కొడుకు బాగుపడాలి.. నా కూతురు సుఖంగా ఉండాలి.. అనే ధోరణి కూడా భారత దేశ అసమానతలకు ఒక కారణం. చాలా మంది యువతకు రాజ్యాంగం గురించి, రాజ్యాంగా రక్షణల గురించి కూడా తెలియదు. అందుకే యువకుల శ్రమ, జ్ఞాన, విద్యా, ఉపాధి, సమతుల్యత, పునరుత్తేజ ఉద్యమానికి నడుము బిగించి సమతా రాజ్యాన్ని నిర్మాణానికి పాలకులతో పాటు అందరం నడుం బిగించాలి. ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది. అసమర్థుడని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు. హృదయంలో ఆత్మవిశ్వాసం, మనస్సుల్లో దృఢ సంకల్పం ఉంటే నీవు ఏదైనా సాధించవచ్చు..!! యువతా మేలుకో. నిన్ను నువ్వు సరిదిద్దుకో. సరైన దారిలో పయనించి ఆరోగ్య, ఆనంద భారతావనికి కృషి చెయ్యి.

అభినందనలతో..

పి. పద్మానంద యోగి,

శ్రీశ్రీశ్రీ భగవాన్ దన్వంతరి యోగాశ్రమం.

పుల్లారెడ్డి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు,

కర్నూల్

సెల్: 9440232704.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News