పరిణీతి ఛోప్రా, రాఘవ్ చద్దా ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని, ఢిల్లీ, ముంబై వీధుల్లో, ఎయిర్ పోర్టులో కలియతిరుగుతున్నారు. అయితే వీరు మరో 5 రోజుల్లోగా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారట. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ముగిసేలోగా వీరి ఎంగేజ్మెంట్ జరుగనుంది కనుక పరిణీతి కజిన్ ప్రియాంక ఛోప్రా ఫ్యామిలీ అంతా ఇండియాకు వచ్చిందట. అంతేకానీ ప్రియాంక చెబుతున్నట్టు సిటడెల్ ప్రమోషన్ కోసం మాత్రమే కాదని తెలుస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయిన రాఘవ్ చద్దా, పరిణీతి ఛోప్రా కలిసి లండన్ లో చదువుకున్నారు. ఇద్దరి కుటుంబాలకు చాలా కాలంగా పరిచయం ఉంది. దీంతో వీళ్ల పెళ్లికి ఎప్పుడో ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అందుకే ఈ లవ్ బర్డ్స్ ఇంత ధైర్యంగా టూర్లు కొట్టేస్తున్నారు. కాకపోతే తనకు పొలిటీషియన్ ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని గతంలో పరిణీతి చెప్పటం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అదంతా రాఘవ్ తో లవ్ ఎపిసోడ్ స్టార్ట్ కాకముందు సంగతి. సో త్వరలో మరో బాలీవుడ్ తార పెళ్లి చేసుకుంటుందన్నమాట. ఏంటో ఈ మధ్య హిందీ యాక్టర్లందరికీ పెళ్లి పిచ్చి పట్టుకుంది. గతంలో నలభైలు దాటినా పెళ్లి ఊసెత్తకపోయేవారు కానీ ఇప్పుడేమో ఇలా పెళ్లిళ్ల బాట పడుతుండటంతో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.