Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Jagadish Reddy: మంత్రితో భేటీ అయిన మాజీ మావోయిస్టు

Jagadish Reddy: మంత్రితో భేటీ అయిన మాజీ మావోయిస్టు

మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ మావోయిస్టు గజ్జల సత్యం రెడ్డి. తెలంగాణా ఏర్పాటు, జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై వీరిద్దరూ ఈ భేటీలో చర్చించుకున్నారు. ఈసందర్భంగా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి,

17 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించి విడుదల అయి.. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు గజ్జల సత్యం రెడ్డి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణా పునర్ నిర్మాణంలో మీలాంటి వారు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి మాజీ మావోయిస్టు సత్యం రెడ్డికి సూచించారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, సీనియర్ టి ఆర్ యస్ నేత నామిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు

- Advertisement -

తెలంగాణా ఏర్పాటుకు ముందు తరువాత ఈ ప్రాంతంలో పెద్ద మార్పు సంభవించిందని మాజీ మావోయిస్టు సత్యం రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యమంలోకి వెళ్లేముందు ఉన్న తెలంగాణాకు ఇప్పటి తెలంగాణాకు అసలు పోలికే లేదని ఆయన చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణా అన్ని రంగాలలో త్వరితగతిన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు చూశానని ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ఆయా రాష్ట్రాలలో లేదని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News