Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Atmakuru: వైసీపీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనంటూ తిరుగుబాటు

Atmakuru: వైసీపీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనంటూ తిరుగుబాటు

ఆత్మకూరు వైసీపీ పట్టణ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని పట్టుబట్టారు ఆత్మకూరు వైసీపీ నేతలు.  ఈమేరకు తమ నేత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసేందుకు ఆత్మకూరు నుండి 21 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డు ఇన్చార్జిలు నంద్యాలకు తరలి వెళ్లారు.  దీంతో ఆత్మకూరు అధికార పార్టీలో వేడి రాజుకుంది.

- Advertisement -

గత కొన్ని రోజుల నుండి ఆత్మకూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడి తీరుపై కౌన్సిలర్లు,  నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రతి పనికి, ప్రతి దానికి అడ్డు తగులుతూ  అంతా నేనే, అంతా నాదే అనే ధోరణిలో నేను చెప్పింది వినాల్సిందేనంటూ, లేదంటే అవతలి వారిపై ఎమ్మెల్యేకు లేనిపోనివి చెప్పి పబ్బం గడుపుకుంటున్న  వైసిపి పట్టణ అధ్యక్షుడిని మార్చాల్సిందేనంటూ కౌన్సిలర్లు, నాయకులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవలే శిల్ప భువనేశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం 16 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఏకంగా 21 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డు ఇన్చార్జిలు వైసిపి పట్టణ అధ్యక్షులు మార్చాలని శిల్పా చక్రపాణి రెడ్డి భేటీ అవ్వటం విశేషం.

పట్టణ అధ్యక్షుడి వ్యవహార శైలితో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, ప్రజా ప్రతినిధి కాకపోయినా నేను చెప్పినట్లే అందరూ వినాలని, నేను చెప్పింది వేదం అంటూ అందరిపై విత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాడని అందుకే ఎలాగైనా సరే ఆయనను తప్పించాల్సిందేనంటూ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.. పట్టణ అధ్యక్షుడు వల్ల చాలామంది బాధపడుతున్నారని మారతాడని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న పట్టణ అధ్యక్షుడి తీరులో మార్పు లేక పోవడంతో ఆయన మార్చాలని ఎమ్మెల్యేకు విన్నవించుకునేందుకు 12 వాహనాలలో 21 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డు ఇన్చార్జిలు నంద్యాలకు వెళ్లారు. మరి ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఆయన పట్టణ పార్టీ అధ్యక్షుడు నుంచి తొలగిస్తారా . తొలగించకపోతే  వైసిపి నాయకులు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News