గత 24 గంటల్లో మహారాష్ట్రలో నలుగురు కోవిడ్ మహమ్మారికి బలయ్యారు. దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో మహారాష్ట్ర్రలో మొత్తం 11 మంది మరణించారు. మహారాష్ట్రలో శరవేగంగా పాకుతున్న కరోనా మహమ్మారి చాలామందిని అస్వస్థతకు గురి చేస్తోంది. కోవిడ్ కేసులు సంఖ్య మహారాష్ట్రలో అమాంతంగా 186శాతంకి చేరుకుంది. ఈరోజు ఒక్కరోజే 711 కొత్త కోవిడ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటిలో 218 కేసులు ముంబైలోనే నమోదుకావటం విశేషం. నిన్న మహారాష్ట్రలో అధికారికంగా 248 కేసులు నమోదయ్యాయి.
సోలాపూర్, సాంగ్లి, కొల్హాపూర్, సింధుదుర్గ్, పూనే, సతారా జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పూనే, రాయ్ గడ్, థానేల్లో జనసాంద్రత ఎక్కువ కనుక ఇక్కడ కూడా నిత్యం కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇక యావత్ దేశం విషయానికి వస్తే ఈరోజు కొత్తగా 3,038 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,179కి చేరుకున్నాయి.