Sunday, October 6, 2024
HomeతెలంగాణChevella: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

Chevella: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ చేవెళ్ల మండల కేంద్రంలో ధర్నా ప్రభుత్వ దిష్టిబొమ్మ దాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి జి వెంకట్ రెడ్డి సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ… ప్రశ్నించిన ప్రతిసారి బండి సంజయ్ ని టెర్రరిస్టులను, నక్సలైట్లను అరెస్టు చేసినట్టు అరెస్టు చెయ్యడం హేయమైన చర్య అన్నారు. టి.ఎస్.పి.ఎస్.సి. పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనప్పుడు ప్రశ్నించినందుకా? పదో తరగతి బోర్డ్ పరీక్షల తెలుగు హిందీ ప్రశ్నపత్రాల లీక్ పై ప్రశ్నించినందుకా? లేక సిఎం ను ఎం.ఎస్.సి. పొలిటికల్ సైన్స్ డిగ్రీని సూపెట్టమన్నందుకా అని ప్రశ్నించారు. అరెస్టులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.

- Advertisement -

బండి సంజయ్ ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అవినీతి కుటుంబ పాలనపై బిజెపి పార్టీ పోరాటం ఉదృతం చేస్తదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి కృష్ణ గౌడ్ ఓ బి సి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు నితీష్ రెడ్డి బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి భాస్కర్ బీజేవైఎం ఉపాధ్యక్షులు చేగురి ప్రవీణ్ రెడ్డి కృష్ణమోహన్ ఎ రాజు బీజేవైఎం కార్యదర్శి బాల్ రెడ్డి బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఎర్రవల్లి అశోక్ ఎస్సీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఉమా శంకర్ రెడ్డి నియర్ నాయకులు అడ్డేట్ల శ్రీనివాస్ నాయకులు గుడిపల్లి మధు కుమార్ జై సింహారెడ్డి సత్యం మిట్టు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News