బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్. ఈమేరకు ఐపీఎస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఈ కింది విధంగా లేఖను విడుదల చేసింది……..
కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అంశంపై తేదీ. 5.4.2023న డిజిపి శ్రీ అంజనీకుమార్‌పై గౌరవ ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు చేసిన బాధ్యతా రహితమైన, అత్యంత అవాంఛనీయ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారులసంఘం తీవ్రంగా ఖండించింది. శ్రీ రఘునందన్ రావుపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ గౌరవనీయమైన అసెంబ్లీ స్పీకర్‌ను అభ్యర్థించింది. ఒక శాసనసభ్యుని నుండి ఇటువంటి బాధ్యతారహితమైన ప్రకటన, ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిపై అన్‌పార్లమెంటరీ పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత అనాలోచితం, అనారోగ్యకరమైనది. అంతేకాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రజల భద్రత, భద్రత కోసం రేయిం పగలు పని చేస్తున్న తెలంగాణ మొత్తం పోలీసు బలగానికి ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చాలా నిరాశ కలిగించాయి.
సంతకం/-
బి సుమతి
డిఐజి మహిళా భద్రత
Jt సెక్రటరీ IPS అసోసియేషన్
IPS అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ