Friday, September 20, 2024
Homeహెల్త్premature aging: వృద్ధాప్యం దరికి రాకూడదంటే ?

premature aging: వృద్ధాప్యం దరికి రాకూడదంటే ?

వయసులో చిన్నవాళ్లయినా వయసు మీదపడిన వాళ్లల్లాగ కొంతమంది కనిపిస్తారు. చర్మం ముడతలు పడడం, కాంతివిహీనంగా ఉండడం ఇలాంటి వాళ్లల్లో చూస్తాం. నిద్రలేమి, మానసిక, భావోద్వేగాల ఒత్తిడులు ఇందుకు కొన్ని కారణాలు. ఇలాంటివాళ్లు కొన్ని ముందొస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన స్కిన్ తో యంగ్ గా కనిపిస్తారు. ఆ టిప్స్ కొన్ని..

- Advertisement -

 సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు, నుదురు, ముక్కు వంటి వాటిపై సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. చలికాలంలో సైతం ఎస్ పిఎఫ్ 30 పైగా ఉండే సన్ స్క్రీన్ ను చర్మానికి రాసుకోవాలి. సన్ స్ర్కీన్ యుఎవి, యువిబి రేడియేషన్ పాలబడకుండా కాపాడుతుంది. చెమట బాగా కారుతున్న సందర్భాలలో సన్ స్క్రీన్ ను మళ్లా మళ్లా చర్మానికి రాసుకుంటుండాలి. ఎస్ పిఎఫ్ ఉన్న స్కిన్ కేర్ ఐటమ్స్ ను వాడాలి. ఎండలో ఎక్కువగా తిరగాల్సివచ్చినపుడు ప్యాంట్లు, లాంగ్ స్కర్టుల వంటివి వేసుకోవాలి. అలాగే బరువులేని వదులైన పొడవు స్లీవ్స్ ఉన్న షర్టులు వేసుకోవాలి.
 యాంటాక్సిడెంట్లు బాగా ఉన్న ఫుడ్ ను తినాలి. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను యాంటాక్సిడెంట్లు నియంత్రిస్తాయి. తొందరగా వ్రుద్ధాప్యం ఛాయలు చర్మంపై రాకుండా అడ్డుకుంటాయి. యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్రొకోలీ, పాలకూర, కేరట్లు, తోటకూర, అవకెడో, బీట్ రూట్లు, ముల్లంగి, చిలకడదుంపలు, గుమ్మడికాయ, బెర్రీలు, యాపిల్స్ వంటి వాటిని బాగా తినాలి. నీరు బాగా తాగాలి.
 ముఖాన్ని తరచూ కడుక్కుంటుండాలి. రోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా ముఖం కడుక్కోవడం వల్ల యాక్నేపాలబడం. చర్మం కాంతివిహీనం కాదు. దుమ్ము, ధూళితో,మలినాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోవు. అలాగే మేకప్ రిమూవర్ తో ముఖానికున్న మేకప్ తీసేసిన తర్వాత మంచి క్లీన్సర్ తో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మంలోని సహజ నూనెగుణాలు పోకుండా, ఇరిటేషన్ రాకుండా ఉండేందుకు గోరువెచ్చని నీటితో చర్మం పొడారేలా అద్దుతుండాలి. ముఖం శుభ్రంగా కడుక్కకున్న తర్వాత ఏదైనా అప్లై చేసుకోబోయే ముందు టోనర్స్ తప్పనిసరిగా వాడాలి. రోజ్ వాటర్, గ్రీన్ టీ, ఆల్ఫా అండ్ బీటా హైడ్రాక్సీ. విటమిన్ ఇ, విటమిన్ సి కాంపౌనెంట్లను వాడాలి.
 ముఖం హైడ్రేటెడ్ గా కనిపించేందుకు ఉదయం లేదా రాత్రి నిద్రపోవడానికి ముందు మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా రాసుకోవాలి. రెటినాయిడ్స్, విటమిన్ ఎ, గ్రీన్ టీ ఎక్స్ ట్రాట్స్ , విటమిన్ సి ఉన్న లోషన్స్ వాడాలి. పొడిచర్మంపై ముడతలు బాగా కనిపిస్తాయని మరవొద్దు.

 ఒత్తిడి తగ్గడానికి, మూడ్ బాగుండడానికి నిత్యం వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వ్యాయామాల వల్ల నిద్ర బాగా వస్తుంది. చర్మం, శరీర ఆరోగ్యం కూడా బాగా ఉంటాయి. వ్యాయామాలు చేయడం వల్ల చర్మంలోని మలినాలన్నీ చెమటరూపంలో బయటకు వచ్చేసి ఎంతో ఫ్రెష్ గా ఫీలవుతారు. వ్యాయామాలు చేయడం వల్ల ఎండార్ఫిన్స్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు పెరుగుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ వంటివి తగ్గుతాయి. దీంతో చర్మంపై ముడతలు తొందరగా ఏర్పడవు. అలాగే నిత్యం సరైన నిద్రవేళలను కూడా తప్పనిసరిగా పాటించాలి. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల ఒత్తిడి సమస్యలు తలెత్తవు. చర్మానికి కూడా కావలసినంత సాంత్వన లభిస్తుంది.

 వయసు పెరిగేకొద్దీ చర్మం బిగువును కోల్పోతుంది. హెలొరోనిక్ యాసిడ్ బేస్డ్ సొల్యూషన్ వయసు కనపడకుండా చేయడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి చేసే ట్రీట్మెంట్ కూడా ఉంది. దీనివల్ల చర్మంపై ముడతలు తొందరగా పడవు. స్కిన్ టెక్స్చెర్ దెబ్బతినదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News