నవజోత్ సింగ్ సిద్ధూ జైల్లో 34 కేజీల బరువు తగ్గారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సిద్ధూ చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. 6 నెలలుగా పటియాలా సెంట్రల్ జైల్ లో ఉన్న సిద్ధూ జైల్లోకి వచ్చేనాటికి 99 కేజీల బరువున్నారు. 1988లో చేసిన రోడ్ యాక్సిడెంట్ కేసులో ప్రస్తుతం ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్న ఈ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైల్లో రోజూ 4 గంటలపాటు మెడిటేషన్ చేస్తున్నారు. 2 గంటలపాటు యోగా, ఎక్సర్ సైజులు చేస్తున్నారు. 2-4 గంటలపాటు ఏదో ఒకటి చదువుతున్నారు. ఇక బెడ్ టైం విషయానికి వస్తే జస్ట్ 4 గంటలు మాత్రమే ఆయన నిద్రపోతుండటం విశేషం. క్రికెటర్ గా ఉన్న రోజుల్లో ఎంత స్మార్ట్ గా ఉండేవారో అచ్చం ఇప్పుడు అలాగే ఆయన కనిపిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రోజూ కేవలం రెండు పూటలు మాత్రమే ఆయన ఆహారం తీసుకుంటున్నారు. షుగర్, వీట్ అస్సలు తీసుకోరు. సాయంత్రం 6 గంటలు దాటితే ఇంకేమీ సిద్ధూ తినటం లేదు. కొబ్బరి నీళ్లు, చామంతి టీ, ఆల్మండ్ మిల్క్, రోస్ మెరీ టీ వంటివి సిద్ధూ రోజూ తీసుకుంటున్నారు. ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న సిద్ధూ ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన సహాయకులు వివరించటం విశేషం. ప్రస్తుతం ఈయన ఓ క్లర్క్ గా ఉద్యోగం చేస్తూ జైలు జీవితం గడుపుతున్నారు. బారాక్ నంబర్ 10లో ఉంటున్న సిద్ధూ మొన్నటి వరకు మరో పంజాబీ సింగర్ సెలబ్రిటీ దలేర్ మెహందీతో పాటు సెల్ లో ఉన్నారు. దలేర్ రిలీజ్ కావటంతో ప్రస్తుతం ఆయన మిగతా వారితో పాటు ఉంటున్నారు. కాగా రోజూ సిద్ధూను చూసేందుకు జైలు ఖైదీలు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారట.. ఎంతైనా సెలబ్రిటీ కదా ఖైదీల్లోనూ కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది మరి.
Sidhu lost weight: 34 కిలోల బరువు తగ్గిన సెలబ్రిటీ ఖైదీ, జైల్లో బరువు తగ్గేందుకు ఆయన చేసిందిదే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES