రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలు అగోపతి పాలవుతున్నారని ఈ ప్రభుత్వంతో ఇదేం ఖర్మ బాబోయ్ అని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. చాగలమర్రి మండల కేంద్రంలోని భూమానగర్ కు చెందిన 17వ వార్డులో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చేపట్టి, ఇంటింటికి తిరుగుతూ అఖిల ప్రియ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్భాటం తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అన్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడ అభివృద్ధి చేయలేదని కేవలం చేసినట్లు చూపిస్తున్నారు తప్ప అభివృద్ధిలో మాత్రం వెనకడుగు వేసిందన్నారు.
నిత్యావసర ధరలతో ప్రజల నడ్డి విరిగిందని, ప్రజా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ప్రజలు తదితరులు ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పారన్నారు రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయఢంకా మోగిస్తూ, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆమె తెలిపారు.
అంతకుముందు చాగలమర్రికి చేరుకున్న మాజీ మంత్రికి టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ న్యాయవాది నరసింహారెడ్డి సల్ల నాగరాజు యాదవ్ గుత్తి నరసింహులు టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

