Saturday, April 19, 2025
HomeతెలంగాణWeather: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

Weather: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

ఉత్తర కర్నాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణపై పడింది.  దీంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  హైదరాబాద్ లో పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది.  గాలి వాన భీభత్సం సృష్టించింది.  దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో వర్షం కురవటంతో జంటనగరాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.  మరోవైపు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.  తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన ఈరోజు, రేపు కురిసే అవకాశాలున్నట్టు హెచ్చరికలు జారీచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News