Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: మన లక్ష్యం 2024 ఎన్నికలే

Emmiganuru: మన లక్ష్యం 2024 ఎన్నికలే

వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత గ్రామ వార్డు సచివాలయం, వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారథులపై  ఉందని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు.  స్థానిక ఉప్పర కళ్యాణ మండపంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ జేసిఎస్ సచివాలయం కన్వీనర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలి.   రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.  గత టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో అర్హులైన పేదలతో లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ఒక్కొక్క ఇంటి వద్ద 10 నుంచి 15 నిమిషాలు సమయాన్ని కేటాయించి వారి సమస్యలను సవివరంగా తెలుసుకోవాలన్నారు.

ఏప్రిల్ 13వ తేదీ నుంచి ‘జగనన్నకు చెబుతామ’నే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని లబ్ధిదారుల సమస్యలను నేరుగా జగనన్న దృష్టికి తీసుకువెళ్తామన్నారు,

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,వైసిపి నాయకులు బిఆర్. బసిరెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, శివప్ప గౌడ్, బుట్టా రంగయ్య,  తారా రాజశేఖర్,  రియాజ్ ఆహ్మద్,  బందె నవాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. మన్సూర్, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు విరుపక్షి రెడ్డి, జేసిఎస్ కన్వీనర్లు షబ్బీర్ ఆహ్మద్, బంగి శ్రీరామ్, మనోహర్ రెడ్డి, చాంద్ బాష, కాశీవిశ్వనాథ్ రెడ్డి, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, సచివాలయం కన్వీనర్లు, వేంకట్ రెడ్డి, పల్లె శంకర్ రెడ్డి, సత్యన్న స్వామి, నాగిరెడ్డి, దొరబాబు, గిడ్డయ్య,  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News