Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసు.. విచారణ బదిలీపై నేడు తీర్పు

YS Viveka Case: వైఎస్ వివేకా హత్యకేసు.. విచారణ బదిలీపై నేడు తీర్పు

- Advertisement -

YS Viveka Case: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న.. మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి సోదరుడైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసు విచారణపై నేడు కీలకమైన తీర్పు వెలువడనుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై అక్టోబర్ 19న విచారణ ముగించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్ల ధర్మాసనం అప్పటి నుంచి తీర్పును వాయిదా వేస్తూ వస్తోంది.

అయితే, అప్పటి నుండి ఈ కేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేస్తారని ఉత్కంఠ నెలకొంది. ఈలోగా.. ఈ హత్యకు కుటుంబ వివాదాలే కారణమంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్యకి కుటుంబ సభ్యులే కారణమని.. టీడీపీ నేతతో కలిసి ఆయన అల్లుళ్లే ఈ కుట్ర పన్నారని వెల్లడించింది. అంతేకాదు సీబీఐ మీద తీవ్ర ఆరోపణలు చేసిన తులసమ్మ సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

కేసు విచారణ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం అప్పుడే వెల్లడించగా అప్పటి నుండి రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. కాగా నేడు మంగళవారం తీర్పు ఇస్తున్నట్లు సంబంధిత న్యాయవాదులకు రిజిస్ట్రీ సమాచారం ఇచ్చింది. రేపు ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే వివేకా హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న విషయంపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నల ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్ పై విచారణ చేస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది. ఈరోజు ఈ విచారణ బదిలీ కేసు తీర్పుపైనే ఈ కేసు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మరి ఏ రాష్ట్రానికి బదిలీ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News