Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్BJP Operation South: బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి!

BJP Operation South: బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి!

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.  దీంతో ఏపీ బీజేపీలో పరిస్థితులు అనూహ్యంగా మారటం ఖాయమా అన్న చర్చ ప్రారంభమైంది.  కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్ననిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయారు.  అయితే వచ్చే ఏడాది జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బీజేపీకి కలిసి వచ్చే రాజకీయ అంశమంటూ కమలనాథులు అంటున్నారు.  ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత స్తబ్దుగా  ఉంటూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆమధ్య మళ్లీ కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్టు తెగ వార్తలు పుట్టుకొచ్చాయి.  రాష్ట్ర విభజన తరువాత సొంతంగా జై సమైక్యాంధ్ర అనే ప్రాంతీయ పార్టీ పెట్టి పోటీ చేయగా కనీసం డిపాజిట్లు కూడా ఎక్కడా రాకపోగా అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

- Advertisement -

62  ఏళ్ల కిరణ్ కు విస్తృతమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు, మాస్ లీడర్ కాదు.  రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, రాజ్యాంగంపై లోతైన అవగాహన, పట్టున్నప్పటికీ ఆయన తెలుగు ప్రసంగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.  దీనికంతా కారణం ఆయనకు ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడే అలవాటు ఉన్నప్పటికీ తెలుగులో ప్రసంగించే నేర్పు లేకపోవటమే.  రాయలసీమ ప్రాంతానికి చెందిన కిరణ్ అటు హైదరాబాద్ లో కానీ ఇటు సొంత జిల్లాలో కానీ ఏమాత్రం అలికిడి చేయకుండా దశాబ్దకాలంపాటు నిశ్సబ్దంగా ఉండిపోయారు.  తాజాగా బీజేపీలో చేరిన ఈయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా అనే రాజకీయ సమీకరణాలు తెరపైకి ఇప్పుడిప్పుడే జోరుగా వస్తున్నాయి.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి ప్రత్యామ్నంగా బీజేపీ ఎదిగేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ రాయలసీమ నేత ఎంతవరకూ బీజేపీకి సహకరిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని వేనోళ్ల ప్రశంసించిన కిరణ్ ఆరు దశాబ్దాలుగా తమ కుటుంబమంతా కాంగ్రెస్ తో అనుబంధాన్ని నెరుపుతుండగా తానెప్పుడూ కాంగ్రెస్ ను వీడతానని ఊహించలేదంటూ వివరించారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మారలేదని, కేవలం తాను మాత్రమే కరెక్ట్ అని, ప్రజలు, ఇతరులంతా తప్పనే సిద్ధాంతం మాత్రమే కాంగ్రెస్ లో రాజ్యమేలుతోందన్నారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎప్పుడూ నేతల అభిప్రాయాలు తీసుకుని, చర్చిందని అందుకే దేశంలోని అన్ని రాష్ట్ర్రాల్లో పార్టీ క్షీణిస్తోందని కిరణ్ విశ్లేషించారు. 

ఆపరేషన్ సౌత్ లో భాగంగా కమలనాథులు దక్షిణాది రాష్ట్రాలపై బాగా గురి పెట్టినట్టు తాజా పరిస్థితులు వివరిస్తున్నాయి.  కాంగ్రెస్ సీనియర్ లాయలిస్ట్ ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ నిన్ననే బీజేపీలో చేరగా ఈరోజు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటం చూస్తుంటే కమలనాథులు దక్షిణాది రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలను ప్రయోగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News