దేశంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు ఇప్పటికే 3.39 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25,587 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 6,050 కొత్త కేసులు నమోదు కావటం విశేషం. సెప్టెంబర్ 16 తరువాత ఇంత ఎక్కువ కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. నిన్న నమోదైన కొత్త కరోనా కేసులకంటే ఇది 13 శాతం ఎక్కువ. దీంతో కేంద్ర హైలెవెల్ సమీక్షా సమావేశం నిర్వహించి, కోవిడ్ పూరుపై సన్నద్ధతను సమీక్షించింది.
కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖలతో చర్చించి, తాజా పరిస్థితిని సమీక్షించారు. ఈరోజు ఒక్క రోజే కోవిడ్ మూలంగా మొత్తం 13 మంది మృతిచెందినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.