Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభTapsee Pannu: తాప్సీ అనుకుంటే సాధించలేనిది ఏముంది?

Tapsee Pannu: తాప్సీ అనుకుంటే సాధించలేనిది ఏముంది?

నెలల తరబడి కృషి చేసి, కష్టపడి వర్కౌట్లు చేసిన బ్యూటీ తాప్సీ పన్ను ఎట్టకేలకు తాను కోరుకున్న మేకోవర్ సాధించారు.  దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆమెను ఫుల్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాప్సీ అనుకుంటే సాధించలేనిది ఏమైనా ఉందా అంటూ ఆమె సపోర్టర్స్ ఆమెను తెగ పొగుడుతున్నారు.  కాగా ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన తాప్సీ తన యాబ్స్ ను చూపుతూ నవ్వుతూ, టోన్డ్ ఫిజికల్ యాబ్స్ చూపుతూ ఇచ్చిన పోజ్ అందరినీ ఫుల్ ఆకట్టుకుంటోంది.  తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఆమె ఇచ్చిన పోజులు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

హీరోయిన్ ఓరియెంటెడ్, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారి తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో నటిస్తున్న తాప్సీ బిజీ యాక్ట్రెస్ గా కెరీర్ లీడ్ చేస్తున్నారు. సినిమాల్లో తన పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకునే విషయంలో శ్రమించే నటిగా తాప్సీ సుపరిచితం. గ్లామర్, యాక్షన్, డీ గ్లామర్ ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోవటం ఈ డస్కీ బ్యూటీ స్పెషాలిటీ. కాకపోతే వివాదాల్లో తలదూర్చటం ఒక్కటే ఈ బ్యూటీకి ఉన్న చెడ్డ అలవాటని ఫిలిం క్రిటిక్స్ కామెంట్ చేస్తుంటారు. విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్టు బాహాటంగా మాట్లాడే తాప్సీ ఈమధ్య టాలివుడ్ కి పూర్తిగా దూరమై, బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యారు. ఈమధ్య కాలంలో హిట్లంటూ ఏమీ లేక ఆమె వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News