Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్BJP Minority: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 'ఖవ్వాలీలు'

BJP Minority: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ‘ఖవ్వాలీలు’

ముస్లిం మేధావులతో చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించటంలో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ మునిగితేలుతోంది.  ముస్లిం వర్గాన్ని తమవైపు తిప్పుకుని ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఈ రంజాన్ నెలలో విశిష్ఠమైన కార్యక్రమాలను చేపడుతోంది యూపీ బీజేపీ.  ‘సూఫీ సమ్వాద్ మహా అభియాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను సైతం చేపట్టింది యూపీ బీజేపీ. 2024లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయటంలో భాగంగాగనే ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకున్నాయి. యూపీ మైనారిటీ శాఖ కేంద్రంగా ఇవన్నీ అమలవుతున్నాయి. మైనారిటీ శాఖ బృందాలు స్వయంగా దర్గాలు వంటివాటి వద్దకు వెళ్లి ఈ ఖవ్వాలీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టేస్తారు.  ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం మోడీ సర్కారు చేస్తున్న కృషిని కూడా వివరించి ముస్లింలను బీజేపీ వైపు ఆకట్టుకునేలా పనిచేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతి నగరం, పట్టణంలో ఖవ్వాలీ కార్యక్రమాలు తప్పనిసరిగా ఏర్పాటయ్యేలా చొరవ తీసుకుంటోంది రాష్ట్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ.

- Advertisement -

పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో కనీసం రెండున్నర లక్షల మంది ముస్లిం ఓటర్లు ప్రతి నియోజక వర్గంలో ఉండటంతో జయాపజయాల నిర్ణేతలుగా వీరు మారారు, పైగా ఈ నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లోనూ వీరంతా ఎస్పీకే జై కొట్టారు.  ఈ నేపథ్యంలో కనీసం వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లోనైనా ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉన్న బీజేపీ ఇలా ముస్లిం ఓటర్ల కోసం ప్రత్యేక కసరత్తు చేస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News