Chiranjeevi : గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మన మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్టు ఇటీవల అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఆదివారం నాడు చిరంజీవి గోవా లో ఈ అవార్డుని అందుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న చిరంజీవి వేదికపై మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ”కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. అందులో ఇది కూడా. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినీ రంగంలోకి వచ్చాను. నా తల్లిదండ్రులు శివశంకర ప్రసాద్ గా జన్మనిస్తే సినీ పరిశ్రమ నాకు చిరంజీవిగా జన్మనిచ్చింది. నాలుగున్నర దశాబ్దల ప్రయాణంలో పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అయినా నాపై ఇప్పటికీ అదే అభిమానం, ప్రేమ చూపిస్తున్నారు నా అభిమానులు”
”రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాల విలువ తెలిసింది. ప్రేక్షకుల గుండెల్లో నా స్థానం పదిలం. జీవితాంతం ఇక సినీ పరిశ్రమలోనే ఉంటాను. తెలుగుగు ప్రేక్షకుల అభిమానానికి నేను దాసున్ని. నాకు ఇలాంటి అవార్డు ఇచ్చినందుకు నరేంద్రమోడీ గారికి ధన్యవాదాలు” అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్ గా ఇంకోసారి రాజకీయాలకి రానని మరోసారి క్లారిటీ ఇచ్చారు చిరు.