కరోనాకు సన్నద్ధతను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ను ప్రారంభించారు. ఈమధ్య గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఏడు రాష్ట్రాలకు అలర్ట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి మాక్ డ్రిల్ చేపడుతున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై గతవారం రివ్యూ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నేటితో ప్రారంభమైంది. ఈరోజు రేపు, దేశంలోని అన్ని ప్రభుత్వం-ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న కోవిడ్ చికిత్స మౌలిక సదుపాయాలను పరీక్షిస్తారు.