Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: ఆటో యూనియన్ కార్మికులకు గుర్తింపు కార్డులు

Hyd: ఆటో యూనియన్ కార్మికులకు గుర్తింపు కార్డులు

సీఐటీయు నుండి టీఆర్ఎస్ కేవీలో చేరిన ఆటో యూనియన్ కార్మికులకు  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గుర్తింపు కార్డులు ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పకు చెందిన 50 మంది సీఐటీయూని వీడారు.  ఎమ్మెల్యే నివాసం వద్ద గట్టు అశోక్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎత్తరి మారయ్య, రాజు నాయక్, బుజెందర్, అనిల్, కొమురయ్య, యాదగిరి, రాజేష్, శ్రీను, కరీం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News