Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotla: అప్పర్ భద్రపై జగన్ నోరు మెదపరేం?

Kotla: అప్పర్ భద్రపై జగన్ నోరు మెదపరేం?

సీమ రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అప్పర్ భద్రపై జగన్ ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. అప్పర్ బద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టనట్టున్నారని భగ్గుమన్నారు. ప్రజల ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాలే జగన్ కు ముఖ్యమా? కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తూ బడ్జెట్లో 5,300 కోట్లు నిధులు కేటాయించిందని దీని ఫలితంగా నీటి విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.

- Advertisement -

సీమ ప్రయోజనాల కోసం స్పందించాల్సిన ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉండడం సరికాదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి పెంచి అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుదల చేసి రాయలసీమ ప్రాంత ప్రజల రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పరివాహక రాష్ట్రాల అభ్యంతరాలు ఉండరాదని, అయితే అప్పర్ భద్రకు నీటి కేటాయింపులు జరపరాదని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జల వనరుల సంఘానికి రాత మూలకంగా అభ్యంతరం తెలిపినప్పటికీ, కోర్టులో ఈ కేసు పెండింగ్ ఉన్నప్పటికీ ఇన్ని అభ్యంతరాలు, అవాంతరాలను కాదని ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బట్టి చూస్తుంటే ఇది ముమ్మాటికి జగన్ సర్కార్ వైఫల్యమేనని విరుచుకుపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అప్రభద్ర ప్రాజెక్టు నిర్మించి జాతీయ హోదా కల్పిస్తే… కనీసం ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేక రాయకపోవడంతో… చరిత్రలో సీమా ద్రోహిగా మిగిలిపోయారని ఆరోపించారు. తాను చంద్రబాబు నాయుడు సహకారంతో ఎన్నికల ముందు సాగునీటి ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల ,ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం,ఎల్. ఎల్.సి. అండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణ పనులకు జీవో విడుదల చేసి నిధులు కేటాయిస్తే.. నాలుగేళ్లయినా ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోవడం జగన్ కు రైతులపై ఏ పాటి ప్రేమ ఉందో స్పష్టంగా అర్థమైందన్నారు. జగన్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కె.పార్థసారథి రెడ్డి, టిడిపి నేతలు ఆరవీటి సుధాకర్ శెట్టి, కె.వి. కృష్ణారెడ్డి, కనకవీటి పరమేశ్వర రెడ్డి, కదిరికోట ఆదెన్న జి.అల్తాఫ్, అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాచాని శివకుమార్, బూదురు రాఘవేంద్ర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, నందవరం మండలం నాయకులు ముగతి వీరారెడ్డి, సోమల గూడూరు కమల నాభరెడ్డి, జోహారాపురం సంజీవరెడ్డి, గంగవరం వీరుపాక్షి రెడ్డి, రాయచోటి సుధాకర్ రెడ్డి, మారెప్ప, కనకవీడు పెద్ద ఈరన్న, నాగలదిన్నె సత్యన్న, గోనెగండ్ల మండలం నాయకులు అగ్రహారం పార్వతమ్మ, మాజీ సర్పంచులు బోయ రంగముని,సి.ఈరన్న, మాజీ ఎంపిటిసి వెంకట్ రాముడు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News