Sunday, September 22, 2024
HomeతెలంగాణHyd: గవర్నర్ తీరు పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య

Hyd: గవర్నర్ తీరు పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య

రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, మంత్రి మండలి ఆమోదం తెలిపిన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ గారు ఇన్ని రోజులు దగ్గర పెట్టుకొని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తదని తెలిసీ, కొన్ని బిల్లులను ఆమోదం తెలుపడం, కొన్ని బిల్లులను తిరస్కరించడం ఆమె అజ్ఞానానికి నిదర్శనం అని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ గవర్నర్ వ్యవస్థలను అవమానిస్తుందని, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన కోరారు.  బడ్జెట్ సెషన్స్ లో తెలంగాణ రాష్ట్రము పురోగమిస్తుందని చట్ట సభల్లో చెప్పిన గవర్నర్ బయటకి వచ్చిన మరుక్షణమే ప్రభుత్వ కాళ్ళల్లో కట్టే పెడుతూ రాజకీయం చేస్తుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తుందని, రాజ్యాంగ వ్యవస్థలను గవర్నర్ టైం పాస్ కోసం ఉపయోగిస్తుందని, అసలు రాజ్ భవన్ లో ఏమి జరుగుతుందో ఆమె ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బీజేపీ సూచనల మేరకే గవర్నర్ ప్రజా దర్బార్ పేరిట -రాజకీయ దర్బార్ లు నిర్వహిస్తున్నారని, హైదరాబాద్ మొదటి పౌరురాలు మేయర్ వెళితే గేట్ బందు చేసిన రాజ్ భవన్, అదే షర్మిలకి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం తెలిపిన సంఘటనలు తెలంగాణ ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. విచక్షణ అధికారం ఉంది కదా అని ఏమి చేసినా చెల్లుబాటు అయితదని అనుకుంటే పొరపాటే అసలు గవర్నర్ వ్యవస్థనే చేతికి ఉన్న ఆరోవేలు లాంటిదని, తన పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News