Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Suryapeta: గవర్నర్ తమిళిసై పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Suryapeta: గవర్నర్ తమిళిసై పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఆమె గవర్నరా, బిజెపి నాయకురాలా, బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమెకెక్కడిది అంటూ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ మూలసూత్రాలను కాదని చట్టాలు చెయ్యాలని, అధిగమించమనిపిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికే ఉందంటూ ఆయన హూంకరించారు.

- Advertisement -

రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పెట్టేలా ఉంది గవర్రన్ వ్యవహారశైలి అంటూ కామెంట్స్ చేసిన ఆమె, శాసనసభలో ఒకలా… రాజ్ భవన్ లో మరోలా ఉందని ఆరోపించారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టని, బిజెేపీయేతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ఇందతా అంటూ విమర్శించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలకు మోకాలోడ్డే ప్రయత్నమే ఇదంతా అంటూ, గవర్నర్ ను అడ్డుపెట్టి కేంద్రం ఆడుతున్న నాటకమే ఇదంతా అని ఆరోపించారు.

నిన్న గాక మొన్న నిండు సభలో తెలంగాణా అభివృద్ధిని స్వయంగా కొనియాడిన గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ కు వెల్లంగానే అదే సభలో ఆమోదించిన పద్దులను పెండింగ్ లో పెట్టడమే ఇందుకు తార్కాణమన్నారు. బిజెపి యోతరులు పాలిస్తున్న రాష్ట్రాలలో గవర్నర్ ను కేంద్రం బిజెపి కార్యకర్త లాగా వినియోగించుకుంటుందన్నారు. అది రాజకీయ పరంగా బిజెపి కి నష్టమే కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.తమిళనాడు శాసనసభ సమావేశాలలో ఇదే అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీర్మానం చేసింది అంటే కేంద్రం వైఖరి ఏమిటో బట్టబయలు అయిందన్నారు.గవర్నర్ నడ్దు పెట్టుకుని కేంద్రం ఆడుతున్న దుర్మార్గమైన నాటకానికి ఇది నిదర్శనంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంటే తట్టుకోలేక బిజెపి ఈ డ్రామాలను తెర లేపిందని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాల డిమాండ్ బిజెపి పాలిత రాష్ట్రాలలో వస్తున్నందునే ఇటువంటి కుట్రలకు బిజెపి రూట్ మ్యాప్ గీసిందని ఆయన విరుచుకుపడ్డారు.బిజెపి పాలిత రాష్ట్రాల కంటే బిజెపి యోతర రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి మోడీ సర్కార్ కు కంటగింపు గా మరినందునే రాజ్ భవన్ లను అడ్డుపెట్టుకుని గవర్నర్ లతో బిజేపి యెతర రాష్ట్రాలలో శాసన సభలో ఆమోదించిన బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News