అందరికీ విద్య అందాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిని వర్తమానానికి అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదేస్ఫూర్తితో తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. దివంగత మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతి వేడుకలను సూర్యపేటలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే మార్గదర్శనంలో తెలంగాణాలో పాలన కొనసాగుతుందన్నారు. పూలే ఆశయ సాధననే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. అందులో భాగమే కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసి అందరికి విద్యను అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచుంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జడ్ పి చైర్మన్ గుజ్జ దీపికా యుగందర్ రావు, డిసియంయస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జడ్ పి వైస్ చైర్మన్ వేంకట నారాయణ, జిల్లా కలెక్టర్ వెంకట్ రావు,అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,జాయింట్ కలెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.