ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులుగా కర్నూలుకు చెందిన కుల ప్రతాప్, విశాఖపట్నంకు చెందిన ఆనంద్ బాల ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కరాటే సంఘం నూతన కార్యవర్గ కార్యవర్గ కార్యక్రమంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బి రామాంజనేయులు మాట్లాడుతూ కరాటే అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తున్న వారందరి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 64 క్రీడాంశాలలో కరాటే కూడా ఒక క్రీడాంశంగా కేంద్ర ప్రభుత్వం చేర్చి త్వరలోనే విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని క్రీడల శాఖ మంత్రి రోజా ప్రకటించారన్నారు. ఎన్నిక కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి అబ్జర్వర్ రావటం సంతోషకరమని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్గా నటరాజ్ ఎలక్షన్ ఆఫీసర్ గా టీ. గంగాధర్, లీగల్ అడ్వైజర్ గా రవికుమార్, భారత కరాటే ఫెడరేషన్ నుంచి సాయిబురుషి అబ్జర్వర్లుగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా నిర్వహించారు.