మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రుద్రవరం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డ్వాక్రా సంఘాల మహిళలకు వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ రుద్రవరం మండలంలో 662 పొదుపు సంఘాల గ్రూపులు ఉన్నాయని ఈ సంఘాలకు సంబంధించి 2022 – 23 సంవత్సరానికి గాను మూడో విడత వైయస్సార్ ఆసరా 4 కోట్ల 59 లక్షల 28 వేల 42 రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎలా పనిచేశాయని మహిళలంతా ఒకసారి గమనించాలని కోరారు. గతంలో ఉన్న టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని బంగారం ఇంటికి తెప్పిస్తానని చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికి మహిళలను నమ్మించి అధికారం చేపట్టాక మహిళలను మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోరుతూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ బురద జల్లే పనిగా పెట్టుకుందన్నారు. సున్నా వడ్డీ ఆసరా వంటి తదితర సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువ చేస్తుంటే చంద్రబాబుకు ఇష్టం లేదని దీంతో కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్న ఘనత చంద్రబాబుది అన్నారు.
ఎమ్మెల్యే గంగుల పొదుపు సంఘాల మహిళలతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు ఆసరా చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, జెడ్పిటిసి సభ్యురాలు మాధవి, ఎంపీపీ మబ్బు బాలస్వామి, రుద్రవరం వైసీపీ సీనియర్ నాయకుడు గంగిశెట్టి తిమ్మయ్య శెట్టి, ఏడీఏ గిడ్డయ్య, ఎంపీడీవో మధుసూదనరెడ్డి, ఏసీ దానం ఏపీఎం ప్రసాదు, సీసీలు, పొదుపు సంఘాల మహిళలు పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.