Thursday, September 19, 2024
HomeతెలంగాణKuna Srisailam Goud: పూలె జయంతి వేడుకల్లో కూన శ్రీశైలం గౌడ్

Kuna Srisailam Goud: పూలె జయంతి వేడుకల్లో కూన శ్రీశైలం గౌడ్

మహాత్మా జ్యోతి రావ్ పూలె జయంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పుష్పాంజలి ఘటించారు. షాపూర్ నగర్ లోని కూన నివాసం వద్ద ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల హక్కుల కోసం, బాలికల చదువుకోసం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పూలె పోరాట స్పూర్తితో తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనను తరిమికొట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News