Friday, September 20, 2024
HomeతెలంగాణGeorge Reddy: OUలో జార్జ్ రెడ్డి వర్ధంతి పోస్టర్స్

George Reddy: OUలో జార్జ్ రెడ్డి వర్ధంతి పోస్టర్స్

ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వర్ధంతి సభల పోస్టర్లు ఎస్. అర్. &బి.జీ.యన్. అర్ కాలేజ్ లో ఆవిష్కరించారు పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్. ఇండియన్ ఐన్స్టీన్ ఉస్మానియా అరుణతార ఉస్మానియా యూనివర్సిటీ లో మొట్టమొదటిసారిగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో న్యూక్లియర్ గోల్డ్ మెడల్ సాధించిన గొప్ప మేధావి ప్రగతిశీల విప్లవ విద్యార్థి నాయకుడు కా!! జార్జిరెడ్డి అని పి.డి ఎస్.యు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు.
జార్జిరెడ్డి వర్ధంతి సభలను జయప్రదం చేయాలని కోరుతూ పి.డి.ఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జి రెడ్డి 51వ వర్ధంతి సభలో పోస్టర్స్ ను ఖమ్మం నగరంలో ని ఎస్. అర్. &బి.జీ.యన్. అర్ కాలేజ్ కేంద్రంలో పి.డి. యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జ్ పోస్టర్లు ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పి. డి. యస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పాల్గోని మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ లో అరాచక కుక్కలకు, ఎదురునిలిచి పేద విద్యార్థుల పక్షాన నిలుస్తూ భగత్ సింగ్ వారసుడిగా, చేగువేరా స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించి విద్యార్థుల మనసు గెలిచిన గొప్ప నాయకుడు కా!! జార్జ్ రెడ్డి అని అన్నారు.జార్జిరెడ్డి ఈ దేశాన్ని స్థూలంగా అర్థం చేసుకుని ఈ దేశ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని దేశంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకున్న గొప్ప మేధావి జార్జ్ అని పేర్కొన్నారు.
వారిని ఈ తరం విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్యా సాధన కై పని చేయాలన్నారు.

జార్జిరెడ్డి ముఖ్యంగా విద్యారంగ సమస్యల పైన విద్యా వ్యవస్థలో వస్తున్న లోపాలు ఎత్తిచూపుతు శాస్త్రీయ విద్యా విధానం కావాలని విద్యార్థులందరినీ కూడగట్టి ఐక్య ఉద్యమాలు నిర్మించిన దిశాలిని జార్జిరెడ్డిన్నారు.
జార్జ్ రెడ్డి వర్ధంతి సభలు ఏప్రిల్ 13, 14న తేదీలలో జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని కావున విద్యార్థులు, యువకులు, జార్జ్ మిత్రులు అభిమానులు ప్రగతిశీల వాదులు విద్యావంతులు,మేధావులు అధిక సంఖ్యలో సభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం , జిల్లా నాయకులు లక్ష్మణ్, నాయకులు కరుణ్, వినయ్, నవదీప్, రాజేష్ సతీష్, శ్రీకాంత్, శివ, రాకేశ్ జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News