Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభBalagam: మనోహరాబాద్ లో 'బలగం' సినిమా ప్రదర్శన

Balagam: మనోహరాబాద్ లో ‘బలగం’ సినిమా ప్రదర్శన

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో స్తానిక సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ అధ్వర్యంలో బలగం సినిమాను ప్రదర్శించారు.  ఈ సందర్భంగా నత్తి మల్లేష్ మాట్లాడుతూ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు రెండని, అవి చావు, పుట్టుకని ఈ భూమ్మీదకు ఒక జీవి వస్తే ఎంత సంతోషపడతామో, అదే జీవి మృతి చెందితే అంతకు రెట్టింపు బాధపడతామని ఈ సినిమాలో బాగా చూపించారన్నారు.  చావు, దాని చుట్టూ అల్లుకుని ఉన్న సంప్రదాయాలు, ఆ సమయంలో చోటు చేసుకునే భావోద్వేగాలు వీటన్నింటిని మేళవింపుగా  బలగం సినిమాను తెరకెక్కించారు. క్లైమాక్స్ లో ఒగ్గు కథ నడుస్తున్న సమయంలోనైతే గొంతు తడారిపోతోంది. ఎటు చూసినా కళ్ల వెంట నీళ్లు చెమ్మగిల్లిన వారు, కొంగుతో, తువ్వాల్‌తో కళ్లను తుడుచుకుంటున్న వారే కనిపిస్తున్నారు.  ఏడవని జనాలు లేరని, అంతలా జనాలు ఈ సినిమాలో లీనం  అవుతున్నారు. బంధాలు, బందుత్వాలు, సాంప్రదాయాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడంతో పాటు బంధాలను, అనుబంధాలను మర్చిపోతున్న నేటి సమాజానికి వాటి విలువ గురించి అత్యద్భుతంగా ఈ సినిమాలో చూపించారు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు గ్రామస్థులు. వారు తెలిపారు.  చాలా రోజుల తరువాత ఇలా ఊరంతా కలసి ఒక్క చోట చేరి స్క్రీన్ పై సినిమా చూడడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక జనాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News