Thursday, September 19, 2024
HomeతెలంగాణVemula: తెలంగాణకు ప్రతీక, ప్రపంచానికి అబ్బురంలా సచివాలయం

Vemula: తెలంగాణకు ప్రతీక, ప్రపంచానికి అబ్బురంలా సచివాలయం

సెక్రటేరియట్ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సుమారు ఐదున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి నిర్మాణ పనులన్నీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  ప్రధాన బిల్డింగ్ కలియ తిరిగిన మంత్రి మినిస్టర్ చాంబర్స్, మినిస్టర్ పేషి, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రెటరీ చాంబర్స్, సెక్షన్ ఆఫీసర్స్, క్లస్టర్డ్ వర్క్స్ స్టేషన్స్ ఫ్లోర్ వైజ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  అధికారులు, వర్క్ ఏజెన్సీకి, ఆర్కిటెక్ట్ లకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతం విశాలంగా, అన్ని సౌకర్యాలతో ఉండాలని, అప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిపాలనపరమైన పనులు వేగవంతంగా జరుగుతాయనే దూరదృష్టితో సీఎం కేసిఆర్ సెక్రటేరియట్ ను అధునాతన హంగులతో నిర్మించారని మంత్రి వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ లో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ వర్క్స్ ప్లేస్ ఎక్కువ అని అన్నారు. విశాలమైన గదులు,చాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతలని వివరించారు. రాష్ట్ర సచివాలయం ప్రపంచమే అబ్బుర పడేలా, తెలంగాణ ప్రతీకగా నిలిచిపోనుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.  అంతకుముందు నిర్మాణ ప్రాంగణంలో కలియ తిరుగుతూ పార్కింగ్ ఏరియా, మీడియా, ఏటిఎం, బ్యాంక్, క్యాంటీన్, ప్రార్దనా మందిరాలు పనుల ఫినిషింగ్ వర్క్స్ పరిశీలించారు. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీకి మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News