Yadamma Raju : బుల్లితెరపై కొన్నాళ్ల క్రితం పటాస్ అనే ఒక షో సందడి చేసింది. రవి, శ్రీముఖి యాంకర్స్ గా స్టాండప్ కామెడీ టైపులో ప్రోగ్రాంని రన్ చేశారు. ఈ ప్రోగ్రాంకి స్టూడెంట్స్, ఆడియన్స్ కూడా వచ్చేవారు. అలా ఆడియన్స్ లో వచ్చి తన మాటలతో అందర్నీ నవ్వించి కమెడియన్ గా మారాడు యాదమ్మ రాజు. తన జోక్స్, కామెడీ, స్టాండప్ కామెడీ, స్కిట్స్.. ఇలా రకరకాలుగా జనాల్ని నవ్వించి పాపులర్ అయిపోయాడు యాదమ్మ రాజు.
ఆ షో అయిపోయిన తర్వాత కూడా పలు టీవీ షోలు, సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం రాజు పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం ఒక టీవీ షోలో తన ప్రేయసి స్టెల్లా ని పరిచయం చేశాడు. తను కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా బాగానే ఫేమ్ సంపాదించుకుంది. వీరి పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. టీవీ షోలో కనిపించిన తర్వాత అందరికి వీరి గురించి తెలిసింది.
ఇక అప్పట్నుంచి రాజు-స్టెల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి నిశ్చితార్థం జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు టీవీ ప్రముఖులు వీరి నిశ్చితార్థానికి విచ్చేసి ఆశీర్వదించారు. త్వరలోనే వీరు పెళ్లిచేసుకోనున్నారు. అభిమానులు, పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.