Friday, September 20, 2024
HomeతెలంగాణPalakurthi: ప్రజల మనిషి సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనదే-ఎర్రబెల్లి

Palakurthi: ప్రజల మనిషి సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనదే-ఎర్రబెల్లి

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బిఅర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం రాయపర్తి, జేతురాం తండా లకు కలిపి రాయపర్తి శివారు తోటలో, రాయపర్తి మండలం మైలార0, కిస్త పురం, అర్ అండ్ అర్ కాలనీ, మోరిపి రాల, పన్యా నాయక్ తండా, పోతిరెడ్డి పల్లె, వాంకుడోత్ తండా గ్రామాలకు కలిపి మొరిపిరాల క్రాస్ రోడ్డు లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కార్యకర్తలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి దయన్న మీద ప్రేమతో ఓ గౌడన్న తీసుకొచ్చిన కల్లు రుచి చూశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ. పాత కొత్త అనే తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.   తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు నయాపైసా ఇవ్వని బీజేపోళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్‌ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ద‌యాక‌ర్ రావు గారు నిరంత‌రం నియోక‌వ‌ర్గ అభివృద్ధి గురించి, ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తారు. వారి అభివృద్ధికి పాటుప‌డ‌తారు. ఇలాంటి నాయ‌కుడు మీకు ఎమ్మెల్యేగా ఉండ‌టం అదృష్టం. బిఆర్ ఎస్ పార్టీని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని క‌డుపులో పెట్టుకుని దీవించాలి. అండ‌గా ఉండాలి. ఆద‌రించాల‌ని చెప్పారు.

మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావులు మ‌హిళ‌ల‌తో క‌లిసి భోజ‌నాలు చేశారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి ముచ్చ‌టిస్తూ, స‌ర‌దాగా గ‌డిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News