Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభNadav Lapid : కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. IFFI జ్యూరీ హెడ్ పై...

Nadav Lapid : కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. IFFI జ్యూరీ హెడ్ పై దేశవ్యాప్తంగా విమర్శలు..

- Advertisement -

The Kashmir Files : గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి దేశవ్యాప్తంగా పలు సినిమాలని సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కశ్మీర్ ఫైల్స్ కూడా ఉంది. కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణ కాండని కళ్ళకి కట్టినట్టు చూపించి చిన్న సినిమాగా రిలీజయి దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది కశ్మీర్ ఫైల్స్. ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులని కూడా అందుకుంది ఈ సినిమా.

గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రదర్శించారు. అయితే ఈ సినిమాపై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. IFFI జ్యురి హెడ్ నదవ్ లాపిడ్ వేదికపై మాట్లాడుతూ.. ”ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి చూసి మేము ఖంగుతిన్నాము. ఇది ఒక వల్గర్ కంటెంట్ తో, రాజకీయ ఉద్దేశంతో తెరకెక్కిన సినిమాలా ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ చూపించినవన్నీ అవాస్తవం అని అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి ఒక అంతర్జాతీయ వేదికపై అటువంటి సినిమాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.

దీంతో నదవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. ఈ సినిమా యూనిట్, కశ్మీర్ ఫైల్స్ సినిమా అభిమానులు, హిందువులు, కశ్మీర్ పండిట్స్, పలువురు సెలబ్రిటీలు, వేరే దేశాల ప్రతినిధులు.. నదవ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై IFFI జ్యూరీ హెడ్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా ఒక పెద్ద వేదికపై సినిమా యూనిట్ ని పిలిచి సినిమా గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని నవాద్ ని నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. పలువురు నదవ్ పై పోలీస్ కంప్లైంట్స్ చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News