బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచే స్తున్న పథకాలతో పురోగామి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తీరుతో స్ఫూర్తి పొంది, వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న తీరు సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో పలువురు రాజకీయ నాయకులతో పాటు, పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని, బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్. కె. మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటి స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాథూర్ లోని దేవ్నీ కార్పోరేటర్ సూర్యవంశి అమిత్ విజయ్ ప్రకాష్, భుసావల్ కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ్ నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటి కార్పోరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటి కార్పోరేటర్లు బబ్లూ సైయద్, చాంద్ పఠాన్, బీడ్ కో ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ శివాజీ రావ్ ఘోడకే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సెహ్ కారి సంస్థ ఛైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్, జలగావ్ కు చెందిన భికు సోనావానే, సోను పాటిల్, సునీల్ రౌత్, విలాస్ మలేస్, నాసిక్ కు చెందిన సచిన్ కడ్, ముకుంద్ అహిర్, రామ్ నికమ్, బాపు దూబె, ప్రొఫెసర్ చంద్రకాంత్ భచౌ, కార్పోరేటర్, ఎన్సీపి షేలు తహసీల్ ప్రెసిడెంట్ రహీమ్ ఖాన్ పఠాన్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.