Saturday, November 23, 2024
HomeతెలంగాణCheryala: ఇంటి పన్నులు తగ్గించాలని హరీష్ కు విజ్ఞప్తి

Cheryala: ఇంటి పన్నులు తగ్గించాలని హరీష్ కు విజ్ఞప్తి

చేర్యాల మున్సిపాలిటీలో అధికంగా ఉన్న ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ చేర్యాల మున్సిపల్ పాలకవర్గం జిల్లా కేంద్రం సిద్దిపేటలో మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 0.25 ఉన్న ఇంటి పన్నును 0.125 గా తగ్గించాలని మంత్రి ని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, సిడిఎంఏ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి జేఏసి అనే ముసుగులో పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కౌన్సిలర్లు నిత్యం ప్రజల కొరకు ప్రాంత అభివృద్ధి కోసం పని చేసేవారని గుర్తు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్, నాయకులు అంకుగారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News