Friday, September 20, 2024
Homeనేషనల్Viral News: మండపంలో ల్యాప్ టాప్ తో పెళ్లి కొడుకు.. ఈ కష్టాలు పగోడికి కూడా...

Viral News: మండపంలో ల్యాప్ టాప్ తో పెళ్లి కొడుకు.. ఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదు!

Viral News: ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి ప్రపంచం మీద పడగ విప్పిందో వర్క్ ఫ్రొమ్ హోమ్ అనే ఒక అప్షన్ అందరూ వంట బట్టించేసుకున్నారు. అందులో హైబ్రిడ్ అని.. రిమోట్ వర్క్ అని రకరకాల పేర్లతో కూడా ఇంటి నుండే పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే గడిచిన రెండేళ్లలో ప్రపంచంలో పనిచేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి ఇది కొందరికి తమ విధులను ఈజీ చేసినా మరికొందరిని మాత్రం మరింత కష్టాలపాలు చేసింది.

- Advertisement -

పేరుకే వర్క్ ఫ్రొమ్ హోమ్ అని చెప్పి ఉదయం నుండి రాత్రి వరకు మీటింగ్స్ అని.. కాల్స్ అని.. ప్రాజెక్ట్స్ అని చావగొట్టే కంపెనీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అసలే ఈ మధ్య కాలంలో మాంద్యం వస్తుందనే ప్రచారానికి తోడు కొందరికి ఉద్వాసన పలుకుతుండడం కూడా ఐటీ ఉద్యోగులను బయటపెడుతూ మేనేజ్మెంట్ చెప్పింది చెప్పినట్లు వింటూ కొందరు ఒత్తిడిలో కూడా విధులను పూర్తి చేస్తున్నారు.

మీరు పైన ఫోటోలో చూసిన వ్యక్తి కూడా ఆ రెండే కోవకే చెందిన మనిషిలా ఉన్నాడు. ఈ కోల్‌కతా వ్యక్తికి ఇంటి నుండి పని చేయడం కొంచెం ఎక్కువైనట్లే కనిపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వర్క్ ఫ్రొమ్ హోమ్ కష్టాలని ఐటీ ఉద్యోగులంతా షేర్ చేసుకొని దీనిపై ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ ఫోటోలో పంతులు తన పెళ్లికి ఆచారాలు చేస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి తన ల్యాప్‌టాప్‌తో సహా కూర్చుని.. బహుశా పంతులు మంత్రాలకి మమా అంటూ తన పని తాను చేసుకుంటున్నట్లున్నాడు.

నిజానికి కొన్ని కంపెనీలు దారుణమైన పని సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని.. ఉద్యోగులు తమ షిఫ్టులకు మించి పని చేయాల్సి వస్తుందని.. కనీస సెలవులు కూడా లేకుండా పనిచేయించుకుంటున్నారని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. కొన్ని ఐటీ కంపెనీలలో పెళ్లికి ఒక్క రోజు మాత్రమే సెలవు ఇస్తారని.. ఒక్కరోజులోనే అన్నీ పూర్తి చేసుకోవాలని డెడ్ లైన్ పెడతారని పలువురు ఉద్యోగులు కామెంట్లలో మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News