Thursday, September 19, 2024
HomeతెలంగాణAP Vs Telangana: మంత్రి హరీష్ పై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద...

AP Vs Telangana: మంత్రి హరీష్ పై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి

మంత్రి హరీష్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శం అంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. హరీష్ పై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అంటూ సైదిరెడ్డి అన్నారు. ఏపీలో ఎవరిని అడిగినా హరీష్ రావు గురించి చెబుతారని, హరీష్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుందన్నారు. విషయం లేకనే ఏపీ మంత్రులు రెచ్చి పోతున్నారని, ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజుగా మారారన్నారు.

- Advertisement -

ఏపీలో అన్ని పార్టీ లు మోడీ పార్టీలుగా మారిపోయాయన్న సైదిరెడ్డి, హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధమని సవాలు చేశారు. మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీల అభివృద్ధిపై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

హరీష్ రావును మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదని, అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, మాతో అభివృద్ధి లో పోటీ పడండి అన్నారు సైదిరెడ్డి. కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరని, ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారని, తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలని..రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన అంటూ దేశం కూడా బాగుండాలని సైది రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News