Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: మంత్రి పువ్వాడ ఆఫీస్ ముట్టడి

Khammam: మంత్రి పువ్వాడ ఆఫీస్ ముట్టడి

ఖమ్మం జిల్లా, వైరా అసెంబ్లీ పరిధిలోని, కారేపల్లి మండలం, చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షత గాత్రులకు 50,00,000 రూపాయల చెల్లించాలని, ఘటనకి భాద్యులైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు, తాత మధు, వైరా MLA రాములు నాయక్ లపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని పువ్వాడ ఆఫీసు ముట్టడించారు. BSP ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ZP సెంటర్ ఖమ్మం నందు ధర్నా-రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం ముట్టడించారు.

- Advertisement -

కేసుల పాలైనా, ప్రాణాలు పోయినా, బహుజన బిడ్డలకు న్యాయం జరిగేంతవరకు, ఘటన బాద్యులపై హత్యానేరం కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేసేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు, జిల్లా ఇంచార్జ్ లు మేకతోట్టి పుల్లయ్య, పి. సి. వీరాస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, జిల్లా కార్యదర్శులు బి. ఉపేందర్, పల్లెపొంగు విజయ్, అల్లిక వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా కన్వీనర్ ఉప్పల మంజుల, జిల్లా నాయకులు సుభాష్ చంద్రబోస్, బచ్చలకూరి శ్రీకాంత్, మట్టే గురుమూర్తి, బాలరాజు, సాయి చరణ్, చిన్న రామయ్య, అంతోటి శివ, ఊటుకూరి నాగేశ్వరరావు, బొడ్డు బాబురావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News