Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Thota Chandrasekhar: BRS దెబ్బకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' విషయంలో కేంద్రం దిగొచ్చింది

Thota Chandrasekhar: BRS దెబ్బకే ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ విషయంలో కేంద్రం దిగొచ్చింది

ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి చెందిన వివిధ రాజకీయ అంశాలపై కుండబద్ధలు కొట్టినట్టు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో వివరించారు. BRS దెబ్బకే ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ విషయం లో కేంద్రం దిగివచ్చిందని, ఇది ఏపీలో BRS పార్టీ తొలి విజయం అంటూ చంద్రశేఖర్ ఘనంగా వెల్లడించారు.

- Advertisement -

కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపారని, ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేశారన్నారు. AP ప్రజలకి అండగా నిలబడ్డది BRS పార్టీనే అన్న చంద్రశేఖర్, ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఉక్కు ఉద్యమంలో 32 మంది అసువులు బాశారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారని వివరించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయని, జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నట్టు వివరించారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా…. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశామని, వారికి అండగా నిలబడ్డామన్నారు.

RINL Expression of interest ను ఆహ్వానించిందని, BRS దెబ్బకే… కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఇవాళ విశాఖపట్నం లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదన్నారు. బైలడిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారం కు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు.

“మంత్రి హరీష్ రావు పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించిన తోట చంద్రశేఖర్” ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారన్నారు. ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరుకు లేకనే హరీష్ రావు పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై మంత్రి హరీష్ రావు వాస్తవాలే మాట్లాడారని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని, ఆ నాయకుడే కేసీఆర్ అంటూ ఆయన వెల్లడించటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News