Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు: ఎమ్మెల్యే గంగుల

Allagadda: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు: ఎమ్మెల్యే గంగుల

భారతదేశానికి దిశా, దశ చూపినటువంటి మహనీయుడు, రాజ్యాంగ సృష్టికర్త, అన్ని వర్గాల ఆరాధ దైవం ఎన్నో ఇబ్బందులు వచ్చిన లక్ష సాధనలో వెనుకంజ వేయకుండా ఉన్నత చదువులు చదివి భారతదేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ ప్రపంచం ఉన్నంతవరకు ఆయనను మరువజాలమని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి పురస్కరించుకొని ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్న ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మనదేశంలో అమలవుతుందని అందుకు మనమందరము ఆయనను గౌరవించాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దూర దృష్టితో భావితరాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు గంగుల. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విజయవాడలో దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంబేద్కర్ కు నిజమైన ఘన నివాళులర్పిస్తూ మనమందరం ఆయన అడుగుజాడల్లో నడవాలని భావితరాల వారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ జన్మదిన కేక కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి, సీఐ జీవన్ గంగానాద్ బాబు, మహాలక్ష్మి అధినేత ఇంజేటి రంగేశ్వర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ సింగం వెంకటేశ్వర్ రెడ్డి మాదం చెన్నయ్య, మాదం కిషోర్, దశమి ప్రసాదు, కౌన్సిలర్లు నరసింహులు బాలబ్బి చక్రపాణి కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్ .ఏపీపీ షడ్రక్ ,న్యాయవాది సోమశేఖర్ రెడ్డి, కొండపల్లి శేఖర్ రెడ్డి ,టి అమీర్ భాష ,చింతల శేఖర్ భాస్కర్ రెడ్డి భరత్ రెడ్డి జీడి రామిరెడ్డి ఆదిలక్ష్మి, ఎస్సై వెంకట్ రెడ్డి మున్సిపల్ ఏఈ సురేంద్ర నాథ్ రెడ్డి ,వీఆర్వో సంజీవ రాయుడు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News